హైదరాబాద్, మే 18 (నమస్తేతెలంగాణ) : ఆలిండియా కో-ఆర్డినేటెడ్ రిసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ ట్యూబర్ క్రాప్స్(దుంప పంటలు)జాతీయ సదస్సుకు రాజేంద్రనగర్లోని ఉద్యానవన కళాశాల వేదికైంది. రాంద్రనగర్లోని కూరగాయల పరిశోధన కేంద్రం, తిరువనంతపురంలోని సీటీసీఆర్ఐ సంయుక్త ఆధ్వర్యంలో సోమ, మంగళవారాల్లో ఈ సదస్సు జరుగనున్నది.
దేశంలోని 21 కేంద్రాల్లో పనిచేస్తున్న 50 మంది శాస్త్రవేత్తలు ఈ సదస్సులో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా గత సంవత్సరంలో దుంప పంటలపై చేసిన పరిశోధనలను వివరించడంతోపాటు వచ్చే ఏడాది దుంప పంటల సాగులో చేపట్టనున్న పరిశోధనలపై చర్చించనున్నారు.