హైదరాబాద్, జూన్22 (నమస్తే తెలంగాణ): బీసీ రిజర్వేషన్ల సాధనకోసం యుద్ధం చేస్తామని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీహార్లో 65 శాతం రిజర్వేషన్లు రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై విచారం వ్యక్తం చేశారు.
గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ దాకా బీసీ ఉద్యమాన్ని తీసుకెళ్తామని చెప్పారు. త్వరలోనే బీసీ దళ్ ప్రణాళికను ప్రజలందరితో పంచుకుంటామని, ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా బీసీ నేతలంతా భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు.