హైదరాబాద్ : గ్రీన్ఇండియా చాలెంజ్‌లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో నాతిచరామి మూవీ టీం నటీ నటులు అరవింద్ కృష్ణ, సందేశ్, జయశ్రీ రాచకొండ, డైరెక్టర్ నాగు గవర మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా చిత్ర నటుడు అరవింద్ కృష్ణ మాట్లాడుతూ.. గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు. కొవిడ్ తర్వాత ప్రతి ఒక్కరికి ప్రకృతి మీద ప్రేమ మరింత పెరిగిందన్నారు. పర్యవరణ పరిరక్షణకు మొక్కలు నాటడం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అనంతరం సినీ నటులు రవితేజ,రణ్విజయ్ సింగ్,నటి మీనాక్షి దీక్షిత్ ముగ్గురికి గ్రీన్ఇండియా చాలెంజ్ విసిరారు.