సిద్దిపేట, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేసీఆర్ మరో కల సాకారమైంది. సిద్దిపేట జిల్లా నర్మెట శివార్లలో నిర్మించిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీకి శుక్రవారం ట్రయల్న్‌న్రు విజయవంతంగా నిర్వహించారు. మలేషియా నుంచి వచ్చిన అంతర్జాతీయ కన్సల్టెంట్ శ్రీహజ్నాన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఫ్యాక్టరీలోని అన్ని యంత్రాలను పరిశీలించి ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్లో కిరణ్‌కుమార్ (ఓఎస్డీ) శ్రీకాంత్‌రెడ్డి (ప్రాజెక్టు మెనేజర్),ప్రణేశ్గౌడ్ ( ఫ్యాక్టరీ ఇన్చార్జి) ప్రియానిక్ ఇండియా కంపెనీ సిబ్బంది పాల్గొన్నారు. త్వరలో ఫ్యాక్టరీ ప్రారంభం కానున్నది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అంకురార్పణ జరిగిన ఈ ఫ్యాక్టరీ.. మాజీ మంత్రి హరీశ్‌రావు నిరంతర పర్యవేక్షణ, దిశానిర్దేశంతో త్వరితగతిన నిర్మాణం పూర్తి చేసుకున్నది. సిద్దిపేట జిల్లా నర్మెట గ్రామ శివారులో 62 ఎకరాల విస్తీర్ణంలో రూ.300 కోట్లతో తెలంగాణ రాష్ట్ర ఆయిల్‌ఫెడ్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పనులు చివరి దశకు చేరుకున్నాయి.
దీంతో శుక్రవారం ట్రయల్న్ నిర్వహించారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి 2022 ఏప్రిల్ 13న అప్పటి మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు కలిసి భూమిపూజ చేశారు. త్వరితగతిన భూసేకరణ పూర్తి చేసి ప్యాక్టరీ నిర్మాణ పనులను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించి వేగవంతం చేయించారు. తొలి నాలుగేండ్ల పంటల దిగుబడి చేతికి రావడంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నర్మెటలోనే ఆయిల్‌పామ్ గెలలను కొనుగోలు చేయించారు. రైతులు తమ పంట దిగుబడిని తీసుకొచ్చి నర్మెట ఫ్యాక్టరీ వద్ద ఏర్పాటుచేసిన వేబ్రీడ్జి వద్ద తూకం వేస్తున్నారు. ఇప్పటికే 820 మంది రైతులు తమ 2,350 టన్నుల పంటను అమ్ముకున్నారు. ఇందుకుగాను దాదాపు రూ.నాలుగు కోట్లు రైతుల ఖాతాలో జమయ్యాయి. ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కొనుగోలు చేసిన పంటను అశ్వారావుపేట ఫ్యాక్టరీకి తరలించి అక్కడ ప్రాసెస్ చేస్తున్నారు. రైతుల పొలాల నుంచి నర్మెట ప్యాక్టరీ వరకు తీసుకొనిరావడానికి అవసరమైన రవాణ ఖర్చును కూడా ఆయిల్‌ఫెడ్ భరిస్తున్నది.
అత్యాధునిక టెక్నాలజీ
నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీని అన్ని వసతులతో అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు. ఈ ఫ్యాక్టరీలో నూనె ఉత్పత్తి చేయడమే కాకుండా, రిఫైనరీని కూడా పెట్టి ఫైనల్ ప్రొడక్ట్‌ను ఇకడినుంచే నేరుగా మారెట్లోకి పంపించేవిధంగా ఏర్పాట్లుచేశారు. నాలుగు మెగావాట్ల సెల్ఫ్ జనరేషన్ విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని కూడా నెలకొల్పారు. ఇక్కడ వాడిన నీటిని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ద్వారా రీ సైకిల్ చేసే ఏర్పాట్లున్నాయి. 10 కోట్ల లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ స్టోరేజీ ట్యాంకును ఏర్పాటుచేశారు. ఈ ఫ్యాక్టరీలో తొలుత గంటకు 30 టన్నుల గెలలను క్రషింగ్ చేసే సామర్థ్యం ఉన్నది. గెలల పరిమాణం పెరుగుతున్న కొద్దీ క్రషింగ్ సామర్థ్యాన్ని గంటకు 120 టన్నులకు పెంచుకునే అవకాశం ఉన్నది. భారతదేశంలోనే గంటకు 120 టన్నుల గెలలను క్రషింగ్ చేసే సామర్ధ్యం ఉన్న తొలి ఫ్యాక్టరీ ఇదే కావడం విశేషం. ప్రస్తుతం ఇక్కడ మూడు వేబ్రిడ్జీలు, ప్రహారీగోడ, పరిపాలన భవనం, మెకానికల్ పనులు పూర్తి కావచ్చాయి.
నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ భవిష్యత్తులో సిద్దిపేట జిల్లాలోని ఆయిల్‌పామ్ గెలలను మాత్రమే కాకుండా, సమీప జిల్లాలైన జనగామ, మహబూబాబాద్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట, యాదాద్రి-భువనగిరి జిల్లాల నుంచి వచ్చే ఆయిల్‌పామ్ గెలలను కూడా ప్రాసెస్ చేయడానికి అవసరమైన సామర్థ్యంతో దీనిని నిర్మించడం మరో విశేషం. ఈ ఫ్యాక్టరీతో అనేక ప్రయోజనాలున్నాయి. ఇక్కడే వంటనూనె తయారుచేస్తారు. ఆయిల్‌పామ్ కాయల నుంచి వచ్చే పీచుతో పరుపులను తయారుచేస్తారు. వ్యర్థాలను చేపలకు ఆహారం, ఎరువు, బయోగ్యాస్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఈ ఫ్యాక్టరీ వల్ల ఇక్కడి రైతులకు ప్రయోజనం కలగడంతోపాటు ప్రత్యక్షంగా పరోక్షంగా వెయ్యి మందికిపైగా ఉపాధి లభిస్తుంది.
ఆయిల్‌పామ్ రైతులకు కొత్త వెలుగులు ; సంతోషం వ్యక్తం చేసిన హరీశ్‌రావు
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం నర్మెట వద్ద ఏర్పాటుచేసిన ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలో ట్రయల్న్ విజయవంతం కావడంతో స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు సంతోషం వ్యక్తంచేశారు. కేసీఆర్ నాయకత్వంలో అంకురార్పణ జరిగిన ఆయిల్‌పామ్ కర్మాగారం ప్రస్తుతం ప్రారంభ దశకు చేరడం చిరస్మరణీయ ఘట్టం అని పేర్కొన్నారు. బతుకమ్మ, దసరా పండుగ వేళ ఆయిల్‌పామ్ రైతుల్లో కొత్త వెలుగులు నింపుతున్నదని సంతోషం వ్యక్తంచేశారు. ఆయిల్‌పామ్ సాగుచేయడానికి ముందుకు వచ్చే రైతుల్లో నమ్మకం పెరిగిందని తెలిపారు. ఒకవైపు ఆయిల్‌పామ్ సాగు, మరోవైపు ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు. రైతుల కల సాకారం చేశామని, చరిత్రలో నిలిచిపోయేలా పనిచేయడం గొప్ప సంతృప్తిని ఇచ్చిందని తెలిపారు.. ఫ్యాక్టరీ మరి కొద్దిరోజుల్లోనే అందుబాటులోకి వచ్చి రైతులకు లాభాలు ఇస్తుందని ఆకాంక్షించారు. ఈ శుభ సందర్భంగా ఆయిల్‌పామ్ రైతులకు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు.
నర్మెట ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీలోని విభాగాలు
ఫ్యాకరీనిర్మాణం ఇలా..