ముంపు గ్రామంగా ప్రకటించాలని మహోద్యమం.. నారాయణపూర్ గ్రామస్తుల పోరాటం
కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు పోరుబాటపట్టారు. తమ ఊరును ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది.
- 14వ రోజుకు రిలే నిరాహార దీక్ష
- మాజీ ఎమ్మెల్యే సుంకె మద్దతు.. అరెస్టు
- తోపులాటలో విరిగిన మహిళ కాలు,సొమ్మసిల్లిన మరో మహిళ
గంగాధర, ఆగస్టు 22: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామస్తులు పోరుబాటపట్టారు. తమ ఊరును ముంపు గ్రామంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 14వ రోజుకు చేరింది. దీక్షలో భాగంగా శనివారం మధురానగర్ చౌరస్తాలో కరీంనగర్- జగిత్యాల జాతీయ రహదారిపై ధర్నా చేపట్టారు. పోలీసులు గ్రామస్తులను బలవంతంగా పక్కకు తీసుకెళ్తుండగా జరిగిన తోపులాటలో సహీనా కాలు విరుగగా 108లో కరీంనగర్‌లోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. మరో మహిళ సొమ్మసిల్లి పడిపోగా, మధురానగర్ చౌరస్తాలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ధర్నా చేస్తున్న నాయకులు, గ్రామస్తులను అరెస్ట్ చేసి రామడుగు ఠాణాకు తరలించారు.

పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, సీఐ స్థాయి అధికారి ఓ యువకుడిని బూతులు తిట్టాడని గ్రామస్తులు ఆరోపించారు. నారాయణపూర్ రిజర్వాయర్‌తో అష్ట కష్టాలు పడుతున్నామని, ముంపుగ్రామంగా ప్రకటించేదాకా నిరసన కొనసాగిస్తామని స్పష్టంచేశారు. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, బీఆర్ఎస్, ఏఐబీఎఫ్బీ, సీపీఎం నాయకులు గ్రామస్తులకు మద్దతుగా ధర్నాలో పాల్గొనగా పోలీసులు అరెస్ట్ చేసి ఠాణాకు తరలించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మా ట్లాడుతూ.. నారాయణపూర్‌ను ముంపు గ్రా మంగా ప్రకటించాలని కోరితే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గ్రామస్తులపై అక్రమ కేసులు పెట్టిస్తున్నారని దుయ్యబట్టారు. గ్రామస్తులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | కేసులు నమోదైన రైతులను పరామర్శించిన కేటీఆర్, మాజీ మంత్రులు
Steven Smith | స్మిత్ ఖాతాలో మరో మైలురాయి.. మూడో ఆస్ట్రేలియన్‌గా రికార్డు..!
Hanuman Ansh | ‘హనుమాన్ అంశ్’ రివ్యూ.. నీమ్ కరోలీ బాబా జీవితం తెలుగువారిని మెప్పించిందా..?
Form-7 objections | కర్ణాటకలో సమీపిస్తున్న ‘సర్’ గడువు.. ఓటర్ల తొలగింపు కోరుతూ లక్షకు పైగా ‘ఫారం-7’ అభ్యంతరాలు
Bhogi | శర్వానంద్ ‘భోగి’ నుంచి జానపద గీతం విడుదల.. పల్లె జీవితాన్ని కళ్లకు కట్టిన ‘ఎగిలి వరంగ’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

