China President | చైనా అధ్యక్షుడి విమానం శతృదుర్భేద్యం.. అది గాల్లో ఎగిరే కోట..!
China President | చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అధికారిక పర్యటనలకు ఉపయోగించే విమానం కేవలం ఒక రవాణా సాధనం మాత్రమే కాదు. దాన్ని గాల్లో తేలియాడే ఒక అభేద్యమైన కోటగా, అత్యాధునిక మొబైల్ కమాండ్ సెంటర్‌గా చెప్పవచ్చు. ఎయిర్ చైనా సంస్థ నిర్వహించే ఈ బోయింగ్ 747-8 ఇంటర్కాంటినెంటల్ విమానాన్ని చైనా అత్యున్నత స్థాయి నేతల ప్రయాణాల కోసం వినియోగిస్తున్నారు.
China President : చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ అధికారిక పర్యటనలకు ఉపయోగించే విమానం కేవలం ఒక రవాణా సాధనం మాత్రమే కాదు. దాన్ని గాల్లో తేలియాడే ఒక అభేద్యమైన కోటగా, అత్యాధునిక మొబైల్ కమాండ్ సెంటర్‌గా చెప్పవచ్చు. ఎయిర్ చైనా సంస్థ నిర్వహించే ఈ బోయింగ్ 747-8 ఇంటర్కాంటినెంటల్ విమానాన్ని చైనా అత్యున్నత స్థాయి నేతల ప్రయాణాల కోసం వినియోగిస్తున్నారు. అత్యవసర సమయాల్లో ఆదేశాలు జారీచేసే కేంద్రంగా పనిచేసేలా దాన్ని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. ఈ విమానంలో అధ్యక్షుడు జిన్‌పింగ్ బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వచ్చారు. దాంతో ఈ భారీ విమానంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఈ విమానం ఒకప్పుడు ఎయిర్ చైనాకు చెందిన సాధారణ వాణిజ్య విమానం. 2014 చివర్లో ప్రయాణికుల సేవలో ప్రవేశపెట్టారు. కానీ కేవలం కొన్ని నెలలకే అంటే మే 2015లో దీనిని శాశ్వతంగా వాణిజ్య సేవల నుంచి ఉపసంహరించారు. ఆ తర్వాత దీనికి అత్యాధునిక భద్రతా వ్యవస్థలను, విలాసవంతమైన వీఐపీ ఇంటీరియర్‌ను అమర్చేందుకు నెలల తరబడి విస్తృతమైన మార్పులు చేశారు. అన్ని మార్పుల తర్వాత 2016 శరదృతువులో ఇది చైనా అధ్యక్షుడి ప్రాథమిక అధికారిక విమానంగా సేవలు ప్రారంభించింది.
భద్రతా సాంకేతికత
ఈ విమానంలో ప్రపంచంలోనే అత్యుత్తమ భద్రతా సాంకేతికతను అమర్చారు. ప్రభుత్వ, సైనిక కమాండ్ సెంటర్లతో అధ్యక్షుడు నిరంతరం టచ్‌లో ఉండేందుకు వీలుగా మిలిటరీ-గ్రేడ్ ఎన్క్రిప్టెడ్ శాటిలైట్ కమ్యూనికేషన్ వ్యవస్థలు ఉన్నాయి. శత్రు క్షిపణులను పసిగట్టి, వాటిని దారి మళ్లించే రక్షణ వ్యవస్థలు దీని సొంతం. అన్నింటికంటే ముఖ్యంగా దీనిలో ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ పల్స్ (EMP) షీల్డింగ్ టెక్నాలజీ ఉంది. అణుదాడి జరిగినప్పుడు వెలువడే శక్తివంతమైన విద్యుదయస్కాంత తరంగాల నుంచి విమానంలోని ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ వ్యవస్థలను ఇది కాపాడుతుంది. అంటే అణు యుద్ధం స్థాయిలోనే ఎలక్ట్రానిక్ వార్ఫేర్ జరిగినా ఈ విమానం చెక్కుచెదరకుండా పనిచేస్తూనే ఉంటుంది.
పటిష్ఠమైన నిర్మాణం
గతంలో చైనా నేతలు విదేశీ పర్యటనలకు వెళ్లేటప్పుడు సాధారణ వాణిజ్య విమానాలనే తాత్కాలికంగా మార్పులు చేసి వాడేవారు. పర్యటనకు 20 రోజుల ముందు విమానాన్ని తీసుకుని అందులో సోఫాలు, పడకలు అమర్చి వీవీఐపీ క్యాబిన్‌గా మార్చేవారు. పర్యటన ముగిశాక తిరిగి సాధారణ విమానంగా మార్చేసేవారు. ఇది ఖర్చును ఆదాచేసే పద్ధతి. 2001లో అమెరికాలో ప్రత్యేకంగా తయారు చేయించి తెప్పించుకున్న అధ్యక్ష విమానంలో 27 గూఢచర్య పరికరాలు ఉన్నట్లు కథనాలు రావడం చైనాను అప్రమత్తం చేసింది. ఆ సంఘటన తర్వాతే తమ దేశాధినేతల భద్రత విషయంలో చైనా మరింత కఠినంగా వ్యవహరించడం మొదలుపెట్టింది.
ప్రస్తుతం జిన్ పింగ్ ఉపయోగిస్తున్న ఈ ప్రత్యేక విమానం పొడవు 76.4 మీటర్లు. ఇది గంటకు 982 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఒక్కసారి ఇంధనం నింపితే సుమారు 14,500 కిలోమీటర్లు ఆగకుండా ప్రయాణించగలదు. ఈ విమానాన్ని కేవలం చైనా అధ్యక్షుడు, స్టేట్ కౌన్సిల్ ప్రీమియర్ మాత్రమే ఉపయోగించడానికి అనుమతి ఉంది. ఇతర నేతలు చార్టర్డ్ విమానాల్లో ప్రయాణిస్తారు. ఒకప్పుడు ఖర్చు తగ్గించుకునేందుకు సాధారణ విమానాలు వాడిన చైనా, ఇప్పుడు ప్రపంచవేదికపై తన పెరిగిన ప్రాబల్యానికి, భద్రతపట్ల తనకున్న నిబద్ధతకు చిహ్నంగా ఈ ‘ఎగిరే కోట’ ను వినియోగిస్తోంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

