Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10 సీజన్ మొదలైన కొద్ది రోజులకే ఊహించని మలుపులతో ఆసక్తికరంగా మారుతోంది. ‘దశావతారం’ కాన్సెప్ట్‌తో ప్రారంభమైన ఈ సీజన్లో సాధారణ సీజన్లకు భిన్నంగా వరుస ట్విస్టులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి వారం పూర్తికాకముందే ఇద్దరు కంటెస్టెంట్లు ఎలిమినేట్ కావడం ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.సాధారణంగా వారాంతపు ఎపిసోడ్లో ఒక కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులు భావిస్తారు. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నంగా ఎలిమినేషన్ లేకుండానే ఎపిసోడ్ ముగియనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు మిడ్ వీక్‌లోనే బయటకు వెళ్లడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బిగ్ బాస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే మొదటి వారం పూర్తికాకముందే ఇద్దరు కంటెస్టెంట్లను ఇంటి నుంచి బయటకు పంపించడం ఈ సీజన్ ప్రత్యేకతగా మారింది. చరణ్ మహాదేవ్, చైత్ర రాయ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ద్వారా బిగ్ బాస్ ఇంటిని వీడారు. అయితే వారు సీక్రెట్ రూమ్‌లో ఉన్నారని, తర్వాత వైల్డ్ కార్డ్ ద్వారా తిరిగి ఇంట్లోకి వస్తారని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. ఇంట్లో ఉన్న కంటెస్టెంట్లలో కూడా ఇలాంటి అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఊహాగానాలకు హోస్ట్ నాగార్జున తెరదించారు. ఇక ఈ సీజన్లో మరో కొత్త విధానాన్ని బిగ్ బాస్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. కేవలం ఇంట్లోకి అడుగుపెట్టినంత మాత్రాన కంటెస్టెంట్లు హౌజ్‌మేట్స్‌గా మారరు. టాస్కులు, పరీక్షల్లో తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్న తర్వాతే ఆ హోదా దక్కుతుంది. ఇప్పటికే రోహిత్ నాయుడు, టెంపర్ వంశీ, రామ్ ప్రసాద్ ఈ ప్రక్రియలో విజయం సాధించి హౌజ్‌మేట్స్‌గా నిలిచారు. తాజాగా ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా మరికొందరికి ఈ అవకాశం లభించింది.
తాజా ఎపిసోడ్లో హీరో త్రిగుణ్ నాలుగో హౌజ్‌మేట్‌గా ఎంపికయ్యాడు. అనంతరం కామనర్ శాలినీకి ప్రేక్షకుల నుంచి భారీగా ఓట్లు రావడంతో ఆమె ఐదో హౌజ్‌మేట్‌గా నిలిచింది. హౌజ్‌మేట్‌గా ఎంపికైన అనంతరం శాలినీ తనకు మద్దతుగా ఓట్లు వేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఇకపై ఏడవకుండా ఆటపై దృష్టి పెడతానని, తన ఆటతో సమాధానం ఇస్తానని ఉత్సాహంగా చెప్పుకొచ్చింది. ఎపిసోడ్ చివర్లో సీరియల్ నటి దేబ్జానీ మోదక్ ఆరో హౌజ్‌మేట్‌గా ఎంపికైనట్లు నాగార్జున ప్రకటించారు.. దీంతో ప్రస్తుతం మొత్తం ఆరుగురు కంటెస్టెంట్లు హౌజ్‌మేట్స్‌గా మారారు. ఆరుగురు కంటెస్టెంట్లు హౌజ్‌మేట్స్‌గా సేవ్ కావడంతో మిగిలిన ఎనిమిది మందిపై ఒత్తిడి పెరిగింది. ప్రస్తుతం వర్షిణి సౌందరరాజన్, సుధీర్ రెడ్డి, సృష్టి వ్యాకరణం, జబర్దస్త్ నరేష్, నటుడు కృష్ణుడు, ముఖేష్ గౌడ, కామనర్ అమన్ మసూద్, సింగర్ ఝాన్సీ హై రిస్క్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.వచ్చే వారం వీరి ఆటతీరే కీలకం కానుంది. టాస్కుల్లో మెరుగైన ప్రదర్శన ఇవ్వకపోతే వీరిలో ఎవరైనా ఎలిమినేషన్‌కు గురయ్యే అవకాశం ఉంది.