శుక్రవారం 22 జనవరి 2021
Telangana - Dec 27, 2020 , 01:33:31

నారాయణఖేడ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ మృతి

నారాయణఖేడ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ మృతి

నారాయణఖేడ్‌: సంగారె డ్డి జిల్లా నారాయణఖేడ్‌ మున్సిపల్‌ కమిషనర్‌ గం గాపురం శ్రీనివాస్‌ (52) గుండెపోటుతో మృతి చెం దారు. సిద్దిపేటకు చెందిన శ్రీనివాస్‌ ఏడాదిన్నర కాలంగా నారాయణఖేడ్‌ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఆయన,ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం అర్ధరాత్రి గుండెపోటు రావడంతో మరణించారు. పాలిటెక్నిక్‌ కళాశాలలో టైపిస్ట్‌గా ఉద్యోగం పొందిన ఆయన, కొన్నేండ్లపాటు పంచాయతీ కార్యదర్శిగా పనిచేసి ఆ తర్వాత సిద్దిపేట, దుబ్బాక, మందమర్రి మున్సిపల్‌ కార్యాలయాల్లో సీనియర్‌ అసిస్టెంట్‌గా, మున్సిపల్‌ మేనేజర్‌గా విధులు నిర్వహించారు. శ్రీనివాస్‌కు భార్య కవిత, ముగ్గురు కొడుకులు, కూతురు ఉన్నారు.  


logo