Sunrisers Hyderabad | ఐపీఎల్ ఫేవరేట్ టీం విషయంలో ఈ మధ్య టాలీవుడ్ యువ కథానాయికలు ట్రోల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే కలర్ ఫొటో సినిమా హీరోయిన్ చాందిని చౌదరి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుపై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఓ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలో పాల్గోన్న చాందినిని మీ ఫేవరేట్ ఐపీఎల్ టీం ఎంటీ అని రిపోర్టర్ అడుగుతాడు. దీనికి చాందిని చౌదరి సమాధానమిస్తూ.. నాకు ప్రస్తుతం ఏ ఐపీఎల్ టీం ఫేవరేట్ కాదు. నాది ఆంధ్ర మా స్టేట్‌కి ఐపీఎల్ టీం లేదు అంటూ తెలిపింది. దీనికి రిపోర్టర్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తెలుగు టీమ్ అని అనగా.. మా స్టేట్‌ది కాదు కదా అంటుంది. దీంతో ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు తెగ ట్రోల్ చేశారు.
అయితే ఈ వివాదం ముగియకముందే మరో టాలీవుడ్ హీరోయిన్ సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైంది. యువ కథానాయిక రాశి సింగ్ తన ఫేవరేట్ ఐపీఎల్ టీమ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రకటించిన కొద్దిసేపటికే ఆర్సీబీ ఫ్యాన్స్ ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. బెంగళూరులో పుట్టి సన్‌రైజర్స్ టీమ్‌కి సపోర్ట్ చేస్తావ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తాజాగా ఈ ట్రోలింగ్‌పై వీడియో ద్వారా రాశి సింగ్ స్పందించింది.
అందరికి నమస్కారం. నేను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును సపోర్ట్ చేస్తున్నా. ఈ విషయం చెప్పగానే నా మీదా నెగిటివ్ స్ప్రెడ్ చేయడం మెదలుపెట్టారు. నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నా. నేను ఉండేది హైదరాబాద్, జాబ్ చేసేది హైదరాబాద్. నాకు హైదరాబాద్ అంటే చాలా ఇష్టం. అయిన ఈ రోజుల్లో నమ్మకమైన అమ్మాయి దొరకడమే కష్టం. నేను చాలా లోయల్ అమ్మాయిని. మీరు ట్రోల్ చేస్తున్నారని ఇంకో టీమ్‌ని నేను సపోర్ట్ చేయలేను అంటూ చెప్పుకోచ్చింది.
RCB fans Trolling Her for supporting SRH 🥲🥲 pic.twitter.com/iuEQKfVjeL
— Sailesh🔥 (@MeherRameshFan) April 29, 2024