హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ) : ఆసియాలో అతిపెద్ద విద్యాసంస్థల్లో ఒకటైన నారాయణ విద్యాసంస్థ, గూగుల్ క్లౌడ్ ఇండియాతో సాంకేతిక సహకారం కోసం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నది. జనరేటివ్ ఏఐ అండ్ క్లౌడ్ పరిజ్ఞానంతో విద్యారంగంలో నూతన సంస్కరణలు చేపట్టేందుకు, విద్యారంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతోనే ఈ ఒప్పందం చేసుకున్నది.
విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ, అద్భుతమైన ఫలితాలు సాధించేలా విద్యను అందించడంలో ఈ ఒప్పందం ఓ మైలురాయిగా నిలుస్తుంది.