హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ) : జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో నారాయణ విద్యార్థులు టాప్ ర్యాంకులతో మరోసారి సత్తా చాటారు. ఆలిండియా ఓపెన్ క్యాటగిరీలో కుచి సందీప్ 5వ ర్యాంకు, మను పరమేశ్వరన్ 13వ ర్యాంకు, ప్రిన్స్ చౌదరి 14వ ర్యాంకు, వెల్దుర్తి హర్షిత్15, తనయ అగర్వాల్ 16, అన్ష ముప్పాల 20వ ర్యాంకుతో టాప్ 20ర్యాంకుల్లో 6ర్యాంకులు నారాయణ కైవసం చేసుకున్నది.
ఆలిండియా ఓపెన క్యాటగిరీలో 22, 23, 24, 27, 35, 39, 41, 44, 51, 54, 57, 58, 60, 61, 63, 71, 72, 75, 78, 79, 80, 83, 84, 89, 98, 99, 100 వంటి టాప్ 100లోపు 35ర్యాంకులు, 500లోపు 133ర్యాంకులు, 1000 లోపు 217ర్యాంకులు నారాయణ విద్యార్థులు కైవ సం చేసుకున్నారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల డైరెక్టర్లు పీ సింధూర నారాయణ, పీ శరణి నారాయణ మాట్లాడుతూ.. ప్రతిభ చూపిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధ్యాపకులు, సిబ్బందికి అభినందనలు తెలిపారు.