హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా నారాయణరెడ్డి బదిలీ అయ్యారు. గత 11 నెలల్లో ఆయనకు ఇది నాలుగో బదిలీ కాగా, రంగారెడ్డి జిల్లాకు అయన మూడో కలెక్టర్. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 11 మంది ఐఏఎస్‌లు, ముగ్గురు ఐఎఫ్ఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో పలువురు అధికారులను గత 11 నెల్లలో రెండుమూడు చోట్లకు బదిలీ చేయడం గమనార్హం. గతంలో వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా పనిచేసిన టీకే శ్రీదేవిని ఆగస్టు 3న ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ చేశారు. మూడు నెలలు కాకముందే ఇప్పుడు పురపాలకశాఖ కమిషనర్, ఎండీగా బదిలీ చేశారు. మరో అధికారి హరీశ్ ఆర్అండ్బీ శాఖ సంయుక్త కార్యదర్శిగా ఉండగా ఆగస్టు 3న రెవెన్యూ శాఖకు బదిలీ చేశారు. ఇప్పుడు ఐఅండ్‌పీఆర్ కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. సోమవారమే ఆయన బాధ్యతలు స్వీకరించారు. శశాంకను జనవరి 3వ తేదీన మహబూబాబాద్ నుంచి రంగారెడ్డి జిల్లా బదిలీలు చేస్తూ ఆడుకుంటున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అధికారులు కొత్త చోట బాధ్యతలు స్వీకరించి, కుదురుకునేలోగా తిరిగి బదిలీ వేటు వేస్తూ ఇబ్బంది పెడుతున్నది. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 11 మంది ఐఏఎస్‌లు, ముగ్గురు ఐఎఫ్ఎస్లను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా పనిచేసిన శ్రీదేవిని ఆగస్టు 3న ఎస్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ కమిషనర్‌గా బదిలీ చేశారు. ఇప్పుడు పురపాలకశాఖ కమిషనర్ ఎండీగా బదిలీ చేశారు. ఆర్అండ్బీ సంయుక్త కార్యదర్శి హరీశ్‌ను ఆగస్టు 3న రెవెన్యూ శాఖకు బదిలీ చేశారు. ఇప్పుడు ఐఅండ్‌పీఆర్ కమిషనర్ బాధ్యతలు అప్పగించారు. శశాంకను జనవరి 3న మహబూబాబాద్ నుంచి రంగారెడ్డి కలెక్టర్‌గా పంపగా, ఇప్పుడు స్టేట్ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్స్ కమిషనర్‌గా నియమించారు. హన్మంతరావును ఫిబ్రవరి 5న ఐఅండ్‌పీఆర్ కమిషనర్‌గా నియమించి, ఇప్పుడు యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా బదిలీ చేశారు. టీజీఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న నిఖిల్ చక్రవర్తికి కమర్షియల్ ట్యాక్స్ అదనపు కమిషనర్‌గా నియమించారు. హాకా ఎండీ చంద్రశేఖర్‌రెడ్డికి డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ఎండీగా, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనిబాలదేవికి అదనంగా స్పోర్ట్స్ డైరెక్టర్ బాధ్యతలు అప్పగించారు. వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌కు ఎఫ్ఏసీ ఎండీగా ఉన్న కొర్ర లక్ష్మికి స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్‌గా పూర్తి బాధ్యతలు అప్పగించారు.
రాష్ట్రవ్యాప్తంగా 73 మంది స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో 70 మందికి పోస్టింగ్‌లు ఇవ్వగా, మరో ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లను వెయిటింగ్లో ఉంచారు.