హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ) : జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల్లో నారాయణ విద్యాసంస్థలు సత్తాచాటినట్టు డైరెక్టర్లు పీ సింధూర నారాయణ, పీ శరణినారాయణ తెలిపారు. తెలుగు రాష్ర్టాలతో పాటు, సౌతిండియా ఫస్ట్‌ర్యాంక్ నారాయణ విద్యాసంస్థలే దక్కించుకొన్నట్టు చెప్పారు. వివిధ క్యాటగిరీల్లో 6 ఆలిండియా ఫస్ట్ ర్యాంకులు నారాయణ విద్యార్థులే సాధించారని పేర్కొన్నారు. సందేష్ బోగాలపల్లి 3వ ర్యాంకు, రాజ్‌దీప్ మిశ్రా 6వ ర్యాంకు, ఎం బాలాదిత్య 11వ ర్యాంకు, రాఘవ్శర్మ 12వ ర్యాంకు, బిస్మిత్ సాహు 16వ ర్యాంకు, ఆర్యన్ ప్రకాశ్ 17వ ర్యాంకు, ఆమోఘ్ అగర్వాల్ 20వ ర్యాంకు సాధించినట్టు వివరించారు. ఓపెన్ క్యాటగిరీలో టాప్ 20లో 7, వంద లోపు 31 ర్యాంకులతో అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా లీడర్‌గా నిలిచినట్టు వారు పేర్కొన్నారు.