రామచంద్రాపురం, సెప్టెంబర్ 18 : నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే పాఠకుల కోసం అతిపెద్ద దసరా షాపింగ్ బొనాంజాను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీనికి టైటిల్ స్పాన్సర్‌గా సీఎంఆర్ షాపింగ్ మాల్ వ్యవహరిస్తున్నది. దసరా షాపింగ్ సందర్భంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఎంపిక చేసిన షాపుల్లో కొనుగోలు చేసిన వారికి ప్రతిరోజు లక్కీడ్రాలో విలువైన బహుమతులు పొందే అవకాశాన్ని కల్పించింది. శుక్రవారం నుంచి ఈనెల 27వ తేదీ వరకు దసరా బొనాంజా ఉంటుంది.
గురువారం సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం డివిజన్ బీహెచ్ఈఎల్ ఎక్స్ రోడ్డులో ఉన్న సీఎంఆర్ షాపింగ్ మాల్లో సీఎంఆర్ షాపింగ్ మాల్ డైరెక్టర్ మావూరి బాలాజీతో కలిసి నమస్తేతెలంగాణ, తెలంగాణ టుడే వైస్ ప్రెసిడెంట్ డీ చిరంజీవి, అడ్వైర్టెజ్‌మెంట్ జీఎం ఎన్ సురేందర్‌రావు, ఏజీఎం పీ రాములు జ్యోతి ప్రజ్వలనతో దసరా షాపింగ్ బొనాంజా ప్రారంభించారు. అనంతరం సీఎంఆర్ షాపింగ్ మాల్ డైరెక్టర్ బాలాజీ మాట్లాడుతూ.. సీఎంఆర్ షాపింగ్ మాల్ వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకుసాగుతుందని తెలిపారు. తెలుగు రాష్ర్టాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సా రాష్ర్టాల్లోనూ సీఎంఆర్ షాపింగ్‌మాల్ విస్తరించిందని చెప్పారు. దసరా, దీపావళి సందర్భంగా సీఎంఆర్ షాపింగ్‌మాల్‌లో షాపింగ్ చేసిన వినియోగదారులకు రూ.999నుంచే కచ్చితమైన బహుమతులను అందజేస్తున్నట్టు తెలిపారు.
సీఎంఆర్‌లో వినియోగదారులు మెచ్చే డిజైన్స్‌తోపాటు వస్త్ర ప్రపంచంలో నాణ్యతకు కూడా ప్రాధాన్యత ఇస్తున్నట్టు పేర్కొన్నారు. సీఎంఆర్ షాపింగ్ మాల్లో కస్టమర్స్ కోసం ఆకర్షణీయమైన ఆఫర్స్‌ని అందుబాటులో ఉంచడం జరిగిందని అన్నారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకి సపోర్ట్‌గా నిలిచిన సీఎంఆర్ షాపింగ్‌మాల్, సీఎంఆర్ ఫ్యామిలీ మాల్‌తోపాటు బిగ్‌సీ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, మానేపల్లి జ్యూవెలర్స్, వరుణ్ మోటర్స్, కున్ హ్యుండాయ్, హర్ష టయోట, వెంకాబ్ చికెన్, టీవీ పార్ట్నర్ టీన్యూస్, డిజిటల్ పార్ట్నర్ సుమన్ టీవీకి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి, ఏడీవీటీ జీఎం ఎన్ సురేందర్‌రావు ప్రత్యేక ధన్యవాదాలు
తెలిపారు.
కస్టమర్స్ కోసం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే అతిపెద్ద దసరా షాపింగ్ బొనాంజాను ప్రారంభించిందని నమస్తే తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి తెలిపారు. ప్రతిరోజు లక్కీడ్రా ద్వారా విలువైన బహుమతులను అందజేస్తుందని అన్నారు. పదేండ్ల నుంచి నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దసరా షాపింగ్ బొనాంజా నిర్వహిస్తున్నదని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని పాఠకులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. షాపింగ్ మాల్ పెట్టిన స్కీమ్స్ కూడా నమస్తే తెలంగాణ తెలియజేస్తుందని అన్నారు.
ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా పండుగ బొనాంజా తీసుకురావడం జరిగిందని నమస్తే తెలంగాణ అడ్వైర్టెజ్‌మెంట్ జీఎం ఎన్ సురేందర్‌రావు తెలిపారు. సీఎంఆర్ షాపింగ్ మాల్లో రూ.999 షాపింగ్ చేసిన కస్టమర్స్‌కి షాపింగ్ మాల్ వారు బహుమతి అందిస్తున్నారని, దానికి అదనంగా నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే తరఫున కూడా గిఫ్ట్ కూపన్స్ అందజేస్తున్నట్టు చెప్పారు. షాపింగ్ చేసిన తర్వాతి రోజు కస్టమర్స్ సమక్షంలో లక్కీడ్రా తీసి విలువైన బహుమతులు అందజేస్తామని తెలిపారు. వినియోగదారులు దసరా బొనాంజాలో పాల్గొని లక్కీడ్రాలో విజేతలుగా నిలువాలని ఆకాంక్షించారు.