కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 8: కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోర్టు చౌరస్తాలోని శ్రీరాజరాజేశ్వర కల్యాణమండపంలో శనివారం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రాపర్టీ షో మొదటి రోజు గ్రాండ్ సక్సెస్ అయ్యింది. కరీంనగర్ ఆర్డీవో మహేశ్వర్, ఐఎంఏ అధ్యక్షుడు నరేశ్, ప్రముఖ గైనకాలజిస్టు విజయలక్ష్మి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు.
ప్రతి స్టాల్ వద్దకు వెళ్లి ఆయా సంస్థల వివరాలు తెలుసుకున్నారు. రాష్ట్రంలోని ప్రముఖ రియల్ సంస్థలు, బిల్డర్స్, బ్యాంకులు, సోలార్ సంస్థలు స్టాల్స్ ఏర్పాటు చేయగా జిల్లా ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి నిర్మాణ రంగానికి సంబంధించిన ఉత్పత్తులు, వాటి వ్యయాల వివరాలను తెలుసుకున్నారు. ఆర్డీవో మహేశ్వర్ మాట్లాడుతూ ఇండ్ల స్థలాలు, ఇండ్లు, ప్లాట్లు కొనుగోలు చేయాలనుకున్న ప్రజలకు ఇలాంటి వేదికలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయన్నారు.
ఇండ్లకు సంబంధించిన అన్ని వివరాలను అందించే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేయడం అభినందనీయమని కొనియాడారు. వైద్యులు నరేశ్, విజయలక్ష్మి మాట్లాడుతూ కరీంనగర్ అభివృద్ధికి ఇలాంటి వేదికలు ఎంతో అవసరం అన్నారు. నమస్తే తెలంగాణ కరీంనగర్ బ్రాంచి మేనేజర్, బ్యూరో ఇన్చార్జి కే ప్రకాశ్‌రావు, యాడ్స్ మేనేజర్ రేణ మల్లయ్య, టీన్యూస్ స్టాఫర్ వేణుగోపాల్‌రావు, నమ స్తే తెలంగాణ కరీంనగర్, ఆదిలాబాద్ ఎడిషన్ ఇన్చార్జిలు సుభాష్, సంపతి, స్టాఫర్ వెంకటస్వామి, అసిస్టెంట్ చీఫ్ ఫొటోగ్రాఫర్బాలకిషన్రావు పాల్గొన్నారు.