Caste Census | హైదరాబాద్, ఫిబ్రవరి 5( నమస్తే తెలంగాణ): బీసీ డిక్లరేషన్ పేరుతో ఎన్నికల వేళ వెనుకబడిన తరగతులకు హామీలు కురిపించిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆచరణలో మాత్రం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కులగణనలో బీసీ కోటాను తగ్గించి చూపించడంలో కుట్ర దాగి ఉందని బీసీ సంఘాల నేతలు మండిపడుతున్నారు.
తూతూమంత్రంగా శాసనసభ తీర్మానం చేసి, కేంద్రానికి పంపి చేతులు దులుపుకొందని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ నైజాన్ని 7 నెలల క్రితమే నిరుడు జూన్ 24న ‘బీసీలకు మొండి చెయ్యే’ నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది. తాజాగా కులగణన-శాసనసభ తీర్మానం-కేంద్రానికి నివేదన నేపథ్యంలో నమస్తే చెప్పిందే నిజమైందని రాజకీయవర్గాలు, ప్రజలు, పాఠకుల్లో చర్చ జరుగుతున్నది.