నిజామాబాద్ : జిల్లా కేంద్రంలోని వేణుమాల్లో నమస్తే తెలంగాణ(Namaste Telangana) – తెలంగాణ టుడే ( Telangana Today) సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షో (Property Show) అట్టహాసంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి , బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ( Prashant Reddy) , నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ( Bigala Gabesh Gupta ) , నమస్తే తెలంగాణ ప్రకటనల విభాగం జనరల్ మేనేజర్ ఎన్. సురేందర్ రావు ( Surendar Rao ) హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
నమస్తే తెలంగాణ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు కొనియాడారు. ఒకే గొడుగు కిందకు రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులను, బ్యాంకర్లను, బిల్డర్స్ అండ్ డెవలపర్స్ లను తీసుకురావడం మంచి ప్రయత్నం అని అభినందించారు. ప్రాపర్టీ షో నాలుగో ఎడిషన్ కార్యక్రమాన్ని నిజామాబాద్లో నమస్తే తెలంగాణ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి, బిగాల గణేష్ గుప్తాలు ప్రశంసించారు.
ప్రాపర్టీ షో ప్రారంభోత్సవంలో మాజీ జడ్పీ చైర్మన్ దాదాన్నగారి విట్టల్ రావు, మాజీ మేయర్ నీతూ కిరణ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు సిర్ప రాజు, బీఆర్ఎస్ నాయకులు సత్య ప్రకాష్, డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.