మొయినాబాద్, అక్టోబర్ 29: విదేశాల్లో అభ్యసించాలని ప్రతి విద్యార్థికి ఉంటుంది. తొలుత దానిపై స్పష్టమైన అవగాహన ఉండాలి. పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. ఇందుకు వై యాక్సిస్ మార్గదర్శకంగా ఉంటుందని వై యాక్సిస్ సొల్యూషన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఫైజుల్ హుస్సేన్ అన్నారు. తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణ దినపత్రికల ఆధ్వర్యంలో ‘ఆవేర్నెస్ ఆన్ ఓవర్సీస్’ ఎడ్యుకేషన్ సదస్సు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం ఎన్కేపల్లిలోని జేబీఆర్ఈసీ కళాశాలలో జరిగింది. వై యాక్సిస్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభించింది.
విదేశాల్లో అభ్యసించాలనుకొనే వారు .. ఉద్యోగాలు పొందాలనుకునే వారు..వ్యాపారాలు చేసే వారు వీసాలు, ఇతర అనుమతులు పొందటం తదితరాంశాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. వీసా దరఖాస్తు మొదలు అక్కడికి వెళ్లే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. గుర్తింపు పొందిన కన్సల్టెన్సీలను సంప్రదించాలని, మోసాల బారిన పడొద్దని సూచించారు. వీసాలు ఎలా పొందాలనే అంశాలపై వై యాక్సిస్ సొల్యూషన్స్ సేవలు అందిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ మూడో ఏడాది నుంచే ప్రణాళికలు రూపొందించు కోవాలని, విదేశాల్లో పేరుగాంచిన విశ్వవిద్యాలయాల్లో చదవాలనుకొనే వారు వైయాక్సిస్ను సంప్రదిస్తే దగ్గరుండి సేవలందిస్తామి తెలిపారు. తెలంగాణ టుడే, నమస్తే తెలంగాణ దినపత్రికలు చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పబ్లికేషన్ మేనేజర్ టీ గణేశ్, ప్రతినిధి మహేశ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
విదేశీ విద్యపై మార్గనిర్దేశం చేసింది 
విదేశీ విద్యపై అవగాహన కోసం నిర్వహించిన సదస్సు ఎంతో ఉపయోగపడుతుంది. విదేశాల్లో చదవాలనే కోరిక అందరికీ ఉంటుంది. కానీ వీసాలు పొందాలనే అంశంపై అవగాహన ఉండదు. విద్యార్థుల చక్కటి భవిష్యత్తు కోసం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే దినపత్రికలు సదస్సు నిర్వహించడం అభినందనీయం.
-అరుణ్మూర్తి, వైస్ ప్రిన్సిపాల్, జేబీఆర్ఈసీ