హైదరాబాద్ అద్భుత ప్రగతిమీద ‘నమస్తే తెలంగాణ’ 4 రోజులుగా ప్రత్యేక కథనాలతో భవిష్యత్తు దర్శనం చేసింది. కాకతాళీయమో మరొకటో గానీ.. గురువారం ఇద్దరు అంతర్జాతీయ ప్రముఖుల నుంచి హైదరాబాద్‌కు, తెలంగాణకు, కేసీఆర్ పాలనకు ప్రశంసలు దక్కాయి. ఫ్రాన్స్‌కు చెందిన మోనిన్ గ్రూప్ చైర్మన్, అమెరికాలోని ఐఐసీ వైస్ ప్రెసిడెంట్ వేర్వేరు వేదికలపై చేసిన ప్రసంగాలు..
విశ్వనగరంగా హైదరాబాద్ అవతరిస్తున్న దృశ్యానికి సంకేతంగా నిలుస్తున్నాయి.
తొమ్మిదేండ్ల అనతికాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగరం నలుదిక్కులా ప్రగతి పరుగులు పెడుతున్నది. భౌగోళికంగా, వనరులు, వసతులపరంగా
ఏ మెట్రో నగరానికీ లేని హంగులు హైదరాబాద్ సొంతం. పటిష్ఠ పాలన, శాంతిభద్రతలు, మత సామరస్యం, టెక్నాలజీలోనూ దేశానికే రాష్ట్రం ఆదర్శం. అందుకే దేశ, విదేశీ కంపెనీలు పెట్ట్టుబడులు పెట్టడానికి తరలివస్తున్నాయి. హైదరాబాద్ అనూహ్య అభివృద్ధిపై ఇటీవల నమస్తే తెలంగాణ వరుస కథనాలు ప్రచురించింది. కాకతాళీయమో, యాథృచ్చికమో తెలియదు కాదు.. దేశ, విదేశీ ప్రతినిధులు సైతం హైదరాబాద్ ప్రగతిని చూసి అబ్బుర పడుతున్నారు. మెచ్చుకుంటున్నారు.