నీలగిరి, అక్టోబర్ 16: నల్లగొండ అగ్నిమాపక స్టేషన్ ఫైర్ అధికారి సత్యనారాయణరెడ్డిని గురువారం ఏబీసీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ తెలిసిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణంలో దీపావళి పండుగ సందర్భంగా పటాకులు దుకాణం తాతాలిక లైసెన్స్ కోసం అగ్నిమాపక అధికారిని ఓ వ్యాపారి సంప్రదించాడు.
దీనికి సదరు అధికారి రూ.10వేలు లంచం డిమాండ్ చేశాడు. ఈ మేరకు గురువారం అగ్నిమాపక కార్యాలయం పక్కనే ఉన్న ఎన్జీ కళాశాల గ్రౌండ్లో బాధితుడి నుంచి సదరు అధికారి రూ.8,000 లంచం తీసుకుంటుండగా నల్లగొండ రేంజ్ యూనిట్ ఏసీబీ రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. సత్యనారాయణరెడ్డిని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపర్చనున్నట్టు డీఎస్పీ తెలిపారు.