
నల్లగొండ: ఆసరా పథకం కింద 57 ఏండ్లు పైబడిన వారికి తెలంగాణ ప్రభుత్వం పింఛన్ ఇవ్వాలని తలంచి ఈ నెల 31వరకు మీ సేవలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించి న నేపథ్యంలో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటివరకు 65 ఏండ్లు పైబడిన వారినే వృద్ధులుగా గుర్తించి పింఛన్ ఇచ్చిన సర్కార్ ఇక నుంచి ఆ వయోపరిమితిని 57 ఏండ్ల కు కుదించింది. అంటే ఇక నుంచి 57ఏండ్ల వయసు పైబడిన వారందరికీ పింఛన్ ఇవ్వనున్న నేపథ్యంలో దరఖాస్తుదారులు మీ సేవలకు క్యూ కడుతున్నారు.
ఈనెల 16 నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 49621 మంది కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తులు చేసుకు న్నారు. 57 ఏండ్లు పైబడిన వారు ఉమ్మడి జిల్లాలో 64 వేల మంది ఉన్నట్లు గ్రామీణాభివృద్ధి యంత్రాంగం అంచనా వేయగా ఇప్పటి వరకు 49వేల దరఖాస్తులు వచ్చాయి.ఈ నెల 31వరకు దరఖాస్తులకు అవకాశం ఉండడంతో ఆరు రోజుల్లో మరో 15వేల దాక వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా ఇప్పటికే జిల్లాలో 3.99లక్షల మందికి సర్కార్ పింఛన్ ఇస్తుండగా 65 ఏండ్లు పైబడిన వారు దరఖాస్తు చేసు కున్న 26 వేలు పెండింగ్లో ఉన్నాయి. వచ్చే నెల నుంచి నూతన పింఛన్దారులందరికీ ప్రభుత్వం పింఛన్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నది.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 49621 దరఖాస్తులు
ఎన్నికల హామీలో భాగంగా 57ఏండ్లు పై బడిన వారందరిని వృద్ధులుగా గుర్తించిన ప్రభుత్వం వారందరికీ పింఛన్ ఇవ్వాల ని తలంచి దరఖాస్తులు స్వీకరించే పనిలో నిమగ్నం కాగా అర్హుల నుంచి దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ప్రాథమికం గా ప్రతి వ్యక్తి సంబంధిత దృవ పత్రాలను జోడించి మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని సూచించటంతో వృద్ధులు మీ సేవల దగ్గర క్యూ కట్టారు.
గడిచిన పది రోజులుగా ఈ దరఖాస్తులు షురూ కాగా ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 49621 మంది నూతనంగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అత్యధికంగా నల్లగొండ నుంచి 22412 మంది, సూర్యాపేట నుంచి 15809 మంది, యాదాద్రి భువనగిరి నుంచి 11400 మంది దరఖాస్తు చేసుకున్నారు. గ్రామీణాభివృద్ధి యంత్రాంగం లెక్కల ప్రకారం నల్లగొండ నుంచి ఆరు వేలు, సూర్యాపేట నుంచి ఆరు వేలు, యాదాద్రి నుంచి మూడు వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది.
ఇప్పటికే 3.99 లక్షల మందికి పింఛన్
ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో వృద్ధులతో పాటు వికలాంగులు, వితంతువులు, చేనేత, గీత, ఒంటరి మహిళలు, ఫైలేరియా వ్యాధిగ్రస్తులు, హెచ్ఐవీ వ్యాధిగ్రస్తుల్లో మొత్తంగా 3.99 లక్షల మందికి ఆయా విభాగాల కింద ఆసరా అందుతుంది. ఇందులో నల్లగొండ నుంచి 1.77 లక్షల మందికి, సూర్యాపేట నుంచి 1.27 లక్షల మందికి, యాదాద్రి నుంచి 94 వేల మందికి అందుతుంది. అయితే 65 ఏండ్లు పైబడ్డ వారు ఇప్పటికే 26 వేల మంది దరఖాస్తు చేసుకోగా, 57 ఏండ్ల నుంచి 65 ఏండ్ల వయసున్న వారు మరో 49వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. పాత పింఛన్దారులకే ప్రభుత్వం ప్రతి నెల రూ. రూ.98.38 కోట్లు ఖర్చు చేస్తుంది.
ఇప్పటివరకు 22వేల దరఖాస్తులు వచ్చాయి : గఫార్, ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్, నల్లగొండ
ఆసరా పింఛన్లకు సంబంధించి వృద్ధుల విషయంలో ఇప్పటి వరకు వయో పరిమితి 65 ఏండ్లుగా ఉండగా దీన్ని 57 ఏం డ్లకు కుదిస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేయటంతో అర్హులైన వారు పెద్ద సంఖ్యలో మీ సేవల్లో దరఖాస్తు చేసుకోవ డానికి వస్తున్నారు. నల్లగొండలో ఇప్పటి వరకు 22412 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ నెల 31 వరకు దరఖాస్తు కు అవకాశం ఉంది. అయితే దరఖాస్తు సమయంలో మీ సేవ నిర్వాహకులు ఎవరి నుంచి డబ్బులు తీసుకోవద్దు అని ఆదేశాలిచ్చాం.