Panchayat Elections | నల్గొండ జిల్లా అనుమల మండలం పేరూరులో పంచాయతీ ఎన్నికలను బహిష్కరించారు. తమ గ్రామంలో సర్పంచ్ పదవిని ఎస్టీకి రిజర్వ్ చేయడానికి నిరసనగా గ్రామస్తులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
పేరూరు గ్రామంలో ఒక్క ఓటరు కూడా ఎస్టీ లేరు. అయినప్పటికీ ఆ ఊరి సర్పంచ్ పదవిని ఎస్టీకి రిజర్వ్ చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు సర్పంచ్ ఎన్నికలను బహిష్కరించారు. సర్పంచ్‌తో పాటు వార్డు మెంబర్లు కూడా నామినేషన్లను బహిష్కరించారు. రిజర్వేషన్లు మార్చి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.