హైదరాబాద్ : తెలంగాణ హోంమంత్రి మహముద్ అలీ సమక్షంలో మహారాష్ట్ర నాగ్‌పూర్ వాసులు భారత్ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా నాసిర్ ఖాన్, సమీర్ షేక్, అజహార్ షేక్, రశీక్ ఖాన్‌తో పాటు పలువురుకి మహముద్ అలీ బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు ఆరిఫుద్దీన్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ.. గత ఎనిమిదిన్నరేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతి దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా సంక్షేమం దృష్ట్యా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుంచి సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలకు బడ్జెట్లో అధిక మొత్తంలో నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు. రాష్ట్రం రోజురోజుకూ అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని గత ఎనిమిదిన్నరేండ్లలో తెలంగాణ రాష్ట్రం అసాధారణమైన అభివృద్ధిని సాధించిందన్నారు. ప్రధానమంత్రి పదవికి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తగిన వ్యక్తి అని హోం మంత్రి అభిప్రాయపడ్డారు.