నాగర్‌కర్నూల్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే రాష్ట్రం అంధకారంలోకి పోవడం ఖాయమని నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి చెప్పారు. శనివారం నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లి మండలం గౌరారంలో పదేండ్ల ప్రజాప్రస్థాన పాదయాత్రను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మర్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో పదేండ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించడంతోపాటు రానున్న కాలంలో చేపట్టాల్సిన ప్రగతిని తెలుసుకునేందుకు ఈ పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు. పదేండ్లుగా ఈ నియోజకవర్గానికి నాయకుడిగా.. సేవకుడిగా ఎన్నో అభివృద్ధి పనులు చేశామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్తు, నీళ్లు లేక, పంటలు పం డక పొట్ట చేత పట్టుకొని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే వారని గుర్తు చేశారు. ఆకలి చా వులు, ఆత్మహత్యలతో ఈ ప్రాంతం అల్లాడిపోయిందని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ అండదండలతో నాగర్‌కర్నూల్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని వివరించారు. పాదయాత్ర ప్రారంభానికి ముందు ఎమ్మెల్యే మర్రి బిజినేపల్లి మం డలం వట్టెం అడ్డగట్టుపై వెంకన్న ఆలయం లో పూజలు చేశారు. అనంతరం గౌరారం లో యాత్ర చేపట్టగా ఘన స్వాగతం లభించింది. గౌరారంలో సర్వమత ప్రార్థన చేసి ఎమ్మెల్యేను దీవించారు. తొలిరోజు గౌరా రం, పర్వతాపురం, రాకొండ గ్రామాల్లో మొత్తం 5 కిలోమీటర్ల మేర ఎమ్మెల్యే పాదయాత్ర కొనసాగింది. రాత్రికి రాకొండలో బస చేశారు. యాత్రలో ఎమ్మెల్యే సతీమణి మర్రి జమున తదితరులు పాల్గొన్నారు.