నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయానికి ( Nagarjunasagar reservoir ) వరద ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ భాగం నుంచి వచ్చిన వరద ప్రవాహంతో జలాశయం నిండుకుండను తలపిస్తుంది. ఈ సందర్భంగా అధికారులు 14 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 589.80 అడుగుల వరకు నీరు నిల్వ ఉంది.
జలాశయం నీటినిల్వ 312.04 టీఎంసీలకు ప్రస్తుతం 311.44 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్‌కు 1,67,702 క్యూసెక్కుల నీరు వస్తుండగా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ కుడి కాల్వకు 9,500 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 8,454 క్యూసెక్కులు, పవర్ హౌస్‌కు 32, 967 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.