నందికొండ: ఎగువ ప్రాంతాల నుంచి వరద వస్తుండడంతో నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి 62090 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో కొనసాగుతుంది, అదే స్థాయిలో ఇన్‌ఫ్లో ఉంది. నాగార్జునసాగర్ డ్యాం 1 క్రస్ట్ గేట్‌ను 5 అడుగుల మేరకు ఎత్తి 8100 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. రిజర్వాయర్ పూర్తి నీటి సామర్ధ్యం 590 (312.0450 టీఎంసీలు) అడుగులకు గాను పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉంది.
నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి కుడి కాల్వ ద్వారా 8529 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 9076 క్యూసెక్కు లు, ఎస్ఎల్బీసీ ద్వారా 1800 క్యూసెక్కులు, వరద కాల్వ ద్వారా 400 క్యూసెక్కులు, ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 34185క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 878.10 అడుగులు (178.7400 టీఎంసీలు) ఉంది. శ్రీశైలంకు 6660 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతుంది.