నల్లగొండ : జిల్లాలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొసాగుతోంది. సాగర్ ఇన్ఫ్లో, ఔట్ ఫ్లో 65,579 క్యూసెక్కులుగా ఉంది. ఈ క్రమంలో ప్రాజెక్టు 2 క్రస్ట్ గేట్లు ఎత్తి 16,138 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ గరిష్ఠ నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం నీటిమట్టం 589.70 అడుగులు. గరిష్ఠ నీటి నిల్వ 312.0405 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటినిల్వ 311.14 టీఎంసీలు.