లండన్: ఇంగ్లండ్ పర్యటనలో తొలి టెస్టును చిత్తుగా ఓడిన పాకిస్థాన్.. రెండో టెస్టులోనూ అదే వైఫల్యాన్ని కొనసాగిస్తున్నది. లార్డ్స్‌లో జరుగుతున్న మ్యాచ్‌లో ఆతిథ్య జట్టును 290 పరుగులకే ఆలౌట్ చేశామన్న ఆనందంలో బ్యాటింగ్‌కు వచ్చిన పాక్.. ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 110 పరుగులకే ఆలౌట్ అయింది. 37.2 ఓవర్లే ఆడిన బాబర్ సేన.. ఒలి రాబిన్సన్ (4/11), జోఫ్రా ఆర్చర్ (3/26), జోష్ టాంగ్ (2/27) ధాటికి విలవిల్లాడింది.
అజన్ (46), షకీల్ (16) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన బ్రూక్ సేన.. బౌలింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై రెండో ఇన్నింగ్స్‌లో కడపటి వార్తలందేసరికి 22 ఓవర్లకు 81/3తో మ్యాచ్‌ను శాసించే స్థితిలో నిలిచింది.