కాఠ్మాండు: నేపాల్ వరదల పెను విషాదానికి సంబంధించిన దృశ్యాలు గుండె బరువెక్కేలా చేస్తున్నాయి. తాజాగా వరదలకు సంబంధించి ఒక ఆసక్తికర వీడియో బయటపడింది. వరద ఉధృతికి ఊరిలోని ఇండ్లన్నీ కొట్టుకుపోయినా ఒక ఇల్లు మాత్రం మధ్యలో తట్టుకుని నిలబడి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఇంట్లోని వారు కూడా అన్ని ఇండ్లు కూలిపోతున్నా ధైర్యంగా నిలబడి సాయం కోసం ఎదురుచూశారు. ఇది ఏ గ్రామంలో జరిగిందో వివరాలు వెల్లడి కాలేదు. ఇంత భారీ వరద నీటిని కూడా తట్టుకునేలా ఆ ఇంటిని నిర్మించిన బిల్డర్‌కు అవార్డు ఇవ్వాలంటూ నెటిజన్లు కోరారు.