కండ్లు తెరవకముందే అంగట్లో ఆడపిల్ల
దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేైండ్లెనా ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ‘అమ్మాయి పుడితే ఆర్థిక ఇబ్బందులు, అబ్బాయి పుడితే వారసుడు వచ్చాడు’ అనే భావన ఇప్పటికీ సమాజంలో వేళ్లూనుకుపోయి ఉంది.
హయత్‌నగర్: దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇన్నేైండ్లెనా ఆడపిల్లలపై వివక్ష కొనసాగుతూనే ఉంది. ‘అమ్మాయి పుడితే ఆర్థిక ఇబ్బందులు, అబ్బాయి పుడితే వారసుడు వచ్చాడు’ అనే భావన ఇప్పటికీ సమాజంలో వేళ్లూనుకుపోయి ఉంది. కొందరు స్కానింగ్‌ల సహాయంతో కడుపులో ఉన్నది ఆడబిడ్డా, మగబిడ్డా అని తెలుసుకొని.. ఒకవేళ ఆడబిడ్డ అయితే కడుపులోనే చంపేస్తుండగా.. మరికొందరు తీరా ఆడపిల్ల పుట్టాక.. ఆ పసికందును అంగట్లో పెట్టి డబ్బులకు అమ్మేసుకుంటున్నారు.
సరిగ్గా ఇలాంటి ఘటనే అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో చోటుచేసుకుంది. పోచమ్మ బస్తీకి చెందిన రమేశ్, రేణుక దంపతులకు అప్పటికే ముగ్గురు కూతుర్లు, ఓ కుమారుడు ఉండగా.. ఈనెల 16న రేణుక మరో కూతురికి జన్మనిచ్చింది. పాప తమకు ఆర్థికంగా భారం అవుతుందనే ఉద్దేశంతో ఆ దంపతులు.. కండ్లు కూడా తెరవని ఆ పసికందును అంగట్లో అమ్మకానికి పెట్టారు. విషయం పోలీసులకు తెలవడంతో ఇప్పుడు ఊచలు లెక్కపెడుతున్నారు.
హయత్‌నగర్, ఆగస్టు 28 : పసికందును విక్రయించిన హృదయ విదారక ఘటనలో నలుగురిపై కేసు నమోదైన ఘటన హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం…అబ్దుల్లాపూర్‌మెట్ మండలం, పెద్దఅంబర్‌పేట పోచమ్మబస్తీలో నివాసముంటున్న పగడాల రమేష్, రేణుక దంపతులకు ముగ్గురు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. గత 16న వనస్థలిపురం ఏరియా ఆస్పత్రిలో రేణుకకు మరో కూతురు జన్మించింది.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా చివరిగా పుట్టిన కూతురును నరేష్ అనే మధ్యవ్యక్తి ద్వారా యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అనగొంటె వెంకటయ్య, లక్ష్మి దంపతులకు పెంచుకోవడానికి దాదాపు లక్షన్నర రూపాయలకు విక్రయించారు. 1098 ద్వారా సమాచారం అందుకున్న ఐసీడీఎస్ హయత్‌నగర్ ప్రాజెక్టు అధికారిణి ఎ.అనిత, చైల్డ్‌లైన్ కౌన్సిలర్ జ్యోతిలతో కలిసి బాధిత కుటుంబ సభ్యులను కలిసి వివరాలను అడిగి తెలుసుకున్నారు. విక్రయించిన పసికందును అమీర్‌పేటలోని శిశువిహార్‌కు అప్పగించారు. ఐసీడీఎస్, చైల్డ్‌లైన్ అధికారుల ఫిర్యాదు మేరకు పగడాల రమేష్, రేణు, అనగొంటి వెంకటయ్య లక్ష్మి దంపతులపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

