హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తేతెలంగాణ) : పవర్ గ్రిడ్ సదరన్ రీజియన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ -1 ఎగ్జిగ్యూటివ్ డైరెక్టర్‌గా ఏ నాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ఆయన ఈడీగా బాధ్యతలు స్వీకరించారు. సదరన్ రీజియన్‌లోని తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాల్లోని కొన్ని ప్రాంతాల్లో పవర్ గ్రిడ్‌కు సంబంధించిన సబ్ స్టేషన్లు, ప్రాజెక్టులను ఆయన పర్యవేక్షిస్తారు. ఉస్మానియా పూర్వవిద్యార్థి అయిన ఆయన 38 ఏండ్ల పాటు వివిధ హోదాల్లో పనిచేశారు. ఇంతకు ముదు ఆయన గుర్గావ్లోని పవర్ గ్రిడ్ కార్పొరేట్ కార్యాలయంలో ఈడీగా పనిచేశారు.