ఇదేం దౌర్జన్యం.. మాకు తెల్వకుండా సర్వే చేస్తరా?
అధికారుల తీరుపై నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ భూములను గుంజుకోవడానికి అధికారులు తమకు తెలియకుండానే సర్వే చేస్తున్నారని, అదీగాక హద్దురాళ్లు కూడా పాతుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం తిమ్మాయిపల్లి శివారులో వ్యవసాయ పొలాల్లో హద్దు రాళ్లు ఏర్పాటు చేయడంపై ఆందోళనకు దిగారు.
- మా భూముల్లో ఇష్టం వచ్చినట్టు హద్దురాళ్లు పాతడమేంది?
- తిమ్మాయిపల్లిలో రైతుల ఆందోళన
చారకొండ, ఆగస్టు 7 : అధికారుల తీరుపై నాగర్కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని తిమ్మాయిపల్లి గ్రామ రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ భూములను గుంజుకోవడానికి అధికారులు తమకు తెలియకుండానే సర్వే చేస్తున్నారని, అదీగాక హద్దురాళ్లు కూడా పాతుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం తిమ్మాయిపల్లి శివారులో వ్యవసాయ పొలాల్లో హద్దు రాళ్లు ఏర్పాటు చేయడంపై ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ వారం రోజుల క్రితం డ్రోన్ కెమెరాలతో తమ భూములను సర్వే చేశారని, తమకు తెలియకుండానే హద్దు రాళ్లు ఏర్పాటు చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎందుకు సర్వే చేస్తున్నారని అధికారులను అడిగితే రోడ్డు అని ఒకరు, తమకు తెలియదని మరొకరు పొంతన లేని సమాధానం ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పొలాల్లో హద్దు రాళ్లు ఏర్పాటు చేయడంతో తాము భయాందోళనకు గురవుతున్నామని, వ్యవసాయంపై ఆధారం పడి జీవిస్తున్నామని ప్రభుత్వం తమ భూములను రోడ్డు, ప్రాజెక్టు, పరిశ్రమల పేరుతో లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఎందుకోసం సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేశారో వెంటనే అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతామని రైతులు హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

