Nagam Janardhan Reddy| పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గండి కొట్టి నల్లగొండ జిల్లాకు నీటిని తరలించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు. ఈ ప్రాంత రైతులకు అన్యాయం చేసేందుకు పూనుకుంటే పార్టీలకతీతంగా ఉద్యమిస్తానని హెచ్చరించారు. అందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోనే విస్తీర్ణంలో పెద్దదిగా ఉన్న ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులకు అన్యాయం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంటున్నదని నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. అలాంటి ప్రయత్నాలు మానుకోకుంటే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.