హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ) : సమగ్ర కుటుంబ సర్వే వల్ల గ్రామాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదేండ్ల భాస్కర్రావు హెచ్చరించారు. కులగణన పేరిట ప్రజల్లో గందరగోళం సృష్టిస్తున్నారని అసంతృప్తి వ్యక్తంచేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్వే చేయడానికి వెళ్లేవారు ప్రజల సందేహాలను తీర్చలేకపోతున్నారని చెప్పారు. సర్వే ఎందుకు చేస్తున్నారో కూడా చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. సర్వే జరుగుతున్న తీరుపై ప్రభుత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.