హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): నాబార్డ్ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని నాబార్డ్ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్(డీడీఎం) పాపసాని మనోహర్‌రెడ్డికి 2025-26 సంవత్సరంలో గ్రామీణాభివృద్ధి రంగంలో విశిష్ట సేవలందించినందుకు ప్రశంసా పురసారం దక్కింది.
శుక్రవారం జరిగిన కార్యక్రమంలో నాబార్డ్ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్ బీ ఉదయ్ భాసర్ ప్రదానం చేశారు. మనోహర్ రెడ్డి జిల్లాల్లో గ్రామీణాభివృద్ధి కోసం చేపట్టిన పలు వినూత్న కార్యక్రమాలకు ఈ అవార్డు లభించింది.