హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : పాఠశాల విద్యాశాఖలో 98 మంది టీచర్లను పరస్పరం బదిలీచేస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీచేశారు. ఇప్పటికే రెండు విడతల్లో పరస్పర బదిలీలు చేపట్టగా, తాజాగా మూడో విడత బదిలీలు చేశారు.
ఆయా ఉత్తర్వులను జిల్లాల వారీగా డీఈవోలకు మెయిల్స్ ద్వారా చేరవేశారు. ప్రాథమిక సమాచారం మేరకు హనుమకొండ జిల్లాలో 10, వరంగల్ జిల్లాలో 12, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 10 మంది చొప్పున టీచర్లున్నారు.