హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): వైద్యారోగ్యశాఖలో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ ముందుకు సాగడంలేదు. నాలుగునెలల క్రితమే దరఖాస్తుల ప్రక్రియ ముగిసినా ప్రభుత్వంలో చలనం లేదు. ఫలితంగా ఆ శాఖలో పనిచేసే 150 మంది ఉద్యోగుల్లో తీవ్ర ఆందోళన నెలకొన్నది. రాష్ట్రవ్యాప్తంగా 648 మంది ఉపాధ్యాయుల మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు జరిగి వారంతా విధుల్లో చేరారు. వైద్యశాఖలో ల్యాబ్ టెక్నీషియన్లు, ఆయుష్ డాక్టర్లు, స్టాఫ్ నర్సులు, వార్డు బాయ్స్, అటెండర్లు కలిపి మొత్తంగా 150 మంది మ్యూచువల్ ట్రాన్స్ఫర్ల బదిలీలు మాత్రం జరగడం లేదు. మ్యూచువల్ ట్రాన్స్ఫర్ల కోసం ప్రభుత్వం జీవో నంబర్ 317ను జారీచేసింది. నిరుడు డిసెంబర్ ఒకటి నుంచి అదే నెల 31 వరకు మ్యూచువల్ ట్రాన్స్ఫర్లకు గడువు విధించగా వైద్య, ఆరోగ్య శాఖలోని ఉద్యోగులు దరఖాస్తులు చేసుకున్నారు. జనవరిలోనే స్పౌజ్, మెడికల్ ట్రాన్స్ఫర్లు చేపట్టినా, మ్యూ చువల్ ట్రాన్స్ఫర్ల ప్రక్రియ పెండింగ్‌లోనే ఉన్నది.
సచివాలయం చుట్టూ ప్రదక్షిణలు చేసినా పట్టించుకునే నాథుడే లేరని, డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌ను కలిసేందుకు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేదని ఉద్యోగులు వాపోతున్నా రు. బీఆర్ఎస్ హయాంలో నెలరోజుల్లోనే ఆయా శాఖల్లో మ్యూచువల్ ట్రాన్స్ఫర్ల ప్ర క్రియ పూర్తిచేశారని, ఇప్పుడు ఆదేశాలివ్వడం లో తాత్సారం చేస్తున్నారని వాపోతున్నారు.