హైదరాబాద్, జూన్ 18 (నమ స్తే తెలంగాణ) : ఈ ఏడాది వాన కాలంలో తెలంగాణతోపాటు 12 రాష్ట్రాలపై ఎల్నినో ప్రభావం చూపే అవకాశం ఉన్నట్టు కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం సమగ్ర కార్యాచరణను ప్రకటించాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ముఖ్యంగా ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రభుత్వం రైతులకు ముందస్తు సూచనలు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. రైతుబంధు, పంటల కొనుగోలు, పంట బీమా, వ్యవసాయ ఇన్పుట్ సరఫరా, తాగునీటి భ ద్రత తదితర అంశాలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని కోరారు.