హైదరాబాద్, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ): మూసీ నిర్వాసితుల జీవనోపాధికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్‌పర్సన్‌గా సెర్ప్ సీఈవో, వైస్ చైర్‌పర్సన్‌గా జీహెచ్ఎంసీ కమిషనర్, ఎంఆర్డీసీఎల్ సంయుక్త మేనేజింగ్ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్‌తో కూడిన 14మంది సభ్యులను కమిటీలో నియమించింది.
పునరావాస ప్రాంతాలకు వచ్చిన నిర్వాసితులకు ఈ కమిటీ జీవనోపాధి కల్పించనున్నది. అంతేకాకుండా నిర్వాసితులను ఇతర ప్రాంతాలకు తరలించే క్రమంలో వచ్చే సమస్యలు,పరిష్కారాలపై కమిటీ అధ్యయనం చేసి 30రోజుల్లో నివేదిక సమర్పించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది.