కోరుట్ల, జూలై 7: జగిత్యాల జిల్లా కోరుట్లలో సంచలనం సృష్టించిన చిన్నారి ఆకుల హితీక్ష (6) హత్య కేసులో మిస్టరీ వీడింది. హితీక్షను చిన్నమ్మ మమతనే హత్య చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. మమత బెట్టింగ్లో రూ.లక్షల్లో డబ్బులు పోగొట్టుకోవడంతో ఇంట్లో చిన్నచూపు చూస్తున్నారని మనోవేదన చెందేది. తోడి కోడలైన నవీన చిన్నచూపు చూస్తున్నదని కక్ష పెంచుకుంది. హితీక్ష తండ్రి రాము సౌదీలో మంచి సంపాదనతో ఆర్థికంగా ఎదగడంతో మమత ఈర్ష్యాద్వేషాలు పెంచుకున్నదని పోలీసు వర్గాల ద్వారా తెలిసింది.