పంతంగి టోల్‌ప్లాజా వద్ద పోలీసుల తనిఖీలు.. కారులో పట్టుబడ్డ రూ.20 లక్షలు
Panthangi toll plaza | మునుగోడు ఉపఎన్నిక వేళ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడుతున్నది. శుక్రవారం హైదరాబాద్‌లో రూ.కోటి 10 లక్షల హవాలా డబ్బును పోలీసులు
చౌటుప్పల్: మునుగోడు ఉపఎన్నిక వేళ హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పెద్దమొత్తంలో డబ్బు పట్టుబడుతున్నది. శుక్రవారం హైదరాబాద్‌లో రూ.కోటి 10 లక్షల హవాలా డబ్బును పోలీసులు సీజ్చేసిన విషయం తెలిసిందే. తాజాగా యాదాద్రి జిల్లా చౌటుప్పల్ సమీపంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ఓ కారులో రూ.20 లక్షలు లభించాయి. శనివారం ఉదయం టోల్గేట్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా.. విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వస్తున్న కారులో డబ్బును గుర్తించారు. అయితే ఆ మొత్తానికి సంబంధించి పత్రాలను చూపించకపోవడంతో డబ్బును, కారును పోలీసులు సీజ్ చేశారు. డబ్బును తరలిస్తున్న అభిషేక్ అనే వ్యక్తిని ప్రశ్నిస్తున్నారు.
కాగా, ఈ నెల 18న మునుగోడు నియోజయకవర్గంలోని గట్టుప్పల్ శివారులో రూ.19 లక్షల నగదు పట్టుబడింది. అంతకుముందురోజు మునుగోడు మండలం చల్మెడ చెక్‌పోస్ట్ వద్ద ఫ్లయింగ్ స్క్యాడ్ టీమ్‌కు ఏకంగా కోటి రూపాయల నగదు చిక్కింది. ఇదే చెక్‌పోస్టు వద్ద ఈనెల 13న ఓ కారులో రూ.13 లక్షలు పట్టుబడిన విషయం తెలిసిందే.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
High tension | పులివెందులలో హైటెన్షన్..గాల్లో కాల్పులు జరిపిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

