హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేస్తున్న మేనేజర్లు, రెవెన్యూ అధికారుల పదోన్నతులతోపాటు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ ఉద్యోగుల కేంద్ర సంఘం (టీఎంఈసీఎఫ్) డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం నేతలు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. రెవెన్యూ అధికారుల పదోన్నతుల విషయంలో మున్సిపల్‌శాఖ ముఖ్యకార్యదర్శి, డైరెక్టర్‌కు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించినట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జీ ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి ఆర్ వెంకటగోపాల్, అసోసియేట్ అధ్యక్షుడు సీహెచ్ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. తమ పిటిషన్‌పై ధర్మాసనం మంగళవారం విచారణ జరిపిందని, జూన్ 24వ తేదీకి వాయిదా వేసినట్టు వెల్లడించారు. డైరెక్టర్ కార్యాలయంలో సుదీర్ఘకాలంగా పనిచేస్తున్న కొందరు ఉద్యోగుల సమస్యల విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. సంఘం తరఫున ఉద్యోగుల సమస్యలపై నిలదీస్తే వారిని టార్గెట్ చేస్తున్నారని తెలిపారు.