హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ధరణిలో క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారంపై ముమ్మర కసరత్తు జరుగుతున్నది. క్యాబినెట్ సబ్‌కమిటీ ఇప్పటికే దాదాపు 20 సమస్యల పరిష్కారానికి ఏడు మాడ్యూల్స్ ప్రవేశపెట్టాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ఇందులో నాలుగు అంశాలకు సంబంధించి తుది నిర్ణయాధికారం ఎవరికివ్వాలనే దానిపై చర్చ జరుగుతున్నట్టు తెలుస్తున్నది. ఇప్పటికే ధరణిలో భూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అనేక మాడ్యూల్స్, ఆప్షన్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఆయా సమస్యల పరిష్కార బాధ్యతను కలెక్టర్లకు అప్పగించింది. ఈ మేరకు ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లు లక్షల దరఖాస్తులను పరిష్కరించారు. ఇప్పుడు 3-4 అంశాలకు సంబంధించిన నిర్ణయాధికారాన్ని కలెక్టర్లకు ఇవ్వాలా? లేక రాష్ట్ర స్థాయిలో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటుచేసి దానికి ఇవ్వాలా? అని ఉన్నతాధికారులు చర్చిస్తున్నట్టు సమాచారం.