గోవిందరావుపేట, హైదరాబాద్ జూలై 12 (నమస్తే తెలంగాణ): ములుగు జిల్లాలో మంత్రి సీతక్క అరాచకాలు బయటపడుతున్నాయనే భయంతోనే చుక్క రమేశ్‌పైకి పోలీసులను ఉసిగొల్పి ఆత్మహత్య చేసుకునేలా చేశారని, ఇది ముమ్మాటికీ సర్కారు హత్యేనని బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావు, రెడ్కో మాజీ చైర్మన్ ఏరువ సతీశ్‌రెడ్డి ఆరోపించారు.
శనివారం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి లో చుక్క రమేశ్ కుటుంబాన్ని పరామర్శించా రు. రమేశ్ కుటుంబానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమకూర్చిన రూ.లక్షను ఆర్థిక సాయంగా అందజేశారు. వారు మాట్లాడుతూ.. లంచాల వసూళ్లతో పాటు పేదలను దోపిడీ చేస్తున్న ఇందిరమ్మ కమిటీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రమేశ్ మరణంపై విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి రూ.50 లక్షల పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు.