హైదరాబాద్ : అభివృద్ధి, సంక్షేమ కార్యర్యక్రమాలతో దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన ముఖరా(కె)గ్రామస్తులు (Mukhara (K) villagers)పాలకులను నిలదీయడంలోనూ ముందే ఉంటూ ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తు న్నారు. వివరల్లోకి వెళ్తే.. అలవిగాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ( Congress government )గద్దెనెక్కాకు హామీలను తుంగలో తొక్కింది. ఆరు గ్యారంటీలు అమలు చేయకపోవడంతో ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముఖరా(కె)గ్రామస్తులు ప్రభుత్వ తీరును నిరసిస్తూ సంక్రాతి పండుగ రోజు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ గోవిందా.. రేవంత్ రెడ్డి గోవిందా అంటూ ముగ్గులు వేశారు. రైతు భరోసా గోవిందా, తులం బంగారం గోవిందా, రైతు రుణమాఫీ గోవిందా, 4,000 పింఛను గోవిందా, మహాలక్ష్మి 2500 గోవిందా, ఆరు గ్యారంటీలు గోవిందా అంటూ ముగ్గులు వేసి నిరసన తెలిపారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఇప్పటి వరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసా 15000 ఇస్తానని చెప్పి రెండు సీజన్లు ఎగగొట్టాడు అని, రుణమాఫీ కాలేదని, ఆరు గ్యారంటీలు బోగస్ అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా రాక పండుంగా చేసేదేలా అంటూ ఇంటి ముందు ముగ్గులు వేసి నిరసన తెలిపారు.