Telangana | కులకచర్ల, నవంబర్ 29 : ‘నాణ్యమైన భోజనం అందక పస్తులు ఉంటున్నాం.. మా గోడు చెప్పుకోవాలంటే బయటకి వెళ్లలేని పరిస్థితి. మీడియాకు చెబుదామన్నా వారిని హాస్టల్లోకి అనుమతించరు. మా సమస్యను ఎవరు తీరుస్తారు’ అంటూ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం కులకచర్ల మండ లం ముజాహిద్పూర్ మాడల్ స్కూల్ హాస్టల్లో వి ద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇందులో సుమా రు 30 మంది విద్యార్థులు ఉంటున్నారు. వారికి ప్రభుత్వం ద్వారా వివిధ సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు.
హాస్టల్లో బాలికలు మాత్రమే ఉండేలా అన్ని ఏర్పాట్లు చేశారు. వారికి వివిధ రకాలుగా వపతులు కల్పించకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఇ బ్బందులు పడుతున్నారు. విషయం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు కొందరు శుక్రవారం ముజాహిద్పూర్ మాడల్ స్కూల్‌కు వెళ్లారు. అయితే వారి ని లోపలికి అనుమతించక పోవడంతో విద్యార్థులనే బయటకు పిలిపించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
మీడియా ప్రతినిధులు తహసీల్దార్ మురళీధర్‌కు సమాచారం అందించడంతో వెంటనే ఆయన అక్కడికి చేరుకొని హాస్టల్లో నెలకొన్న సమస్యలను పరిశీలించారు. తహసీల్దార్ వెంటనే డీఈవో రేణుకాదేవికి సమాచారం అందించగా.. ఆమె హాస్టల్‌కు చేరుకొని అక్కడి వసతులను పరిశీలించారు. ఈ విద్యాసంవత్సరంలో విద్యార్థులకు రెండు సార్లు మా త్రమే గుడ్లు ఇచ్చారని, మాడిపోయిన భోజనాన్ని అందిస్తున్నారని తెలుసుకున్నారు. పాముల భయం తో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి సత్వరం పరిష్కరిస్తామని డీఈవో హామీ ఇచ్చారు.