హైదరాబాద్, ఆగస్టు 23 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు మేరకు రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలుకు కృషిచేయాలని పలువురు మంత్రులకు ఎమ్మార్పీఎస్ బృందం శుక్రవారం విన్నవించింది.
వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేతృత్వంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ, మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, సామాజికవేత్తలు కలిసి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావును కలిశారు.
వర్గీకరణపై త్వరగా నిర్ణయం తీసుకునేలా చూడాలని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు క వ్వంపల్లి సత్యనారాయణ, వేముల వీరేశం, కాలే యాదయ్య, మందుల సామే ల్, ప్రొఫెసర్ మల్లేశం, ప్రొఫెసర్ కాసీం, కొండేటి మల్ల య్య, విజయ్‌కుమార్, బాపిరాజు, మేడి పాపయ్య, గోవింద్ నరేశ్ పాల్గొన్నారు.