గజ్వేల్, జనవరి 5 : రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను అమలుచేస్తామని ఇచ్చిన మాటను రేవంత్రెడ్డి నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సూచించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో ఆదివారం వర్గీకరణ అమలు కోసం మాదిగ, మాదిగ ఉప కులాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు.
వర్గీకరణ కోసం వచ్చే నెల 7న హైదరాబాద్లో నిర్వహించనున్న ‘లక్షల డప్పులు-వేల గొంతులు’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.