ఖైరతాబాద్, డిసెంబర్ 7: దివ్యాంగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండానే, వారి ప్రాతినిధ్యం లేకుండానే ప్రభుత్వం విజయోత్సవాలు ఎలా నిర్వహిస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణమాదిగ ప్రశ్నించారు. వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దివ్యాంగుల సంక్షేమాన్ని ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ్ట ఇచ్చిన హామీ ప్రకారం ఏడాది అంతా కలిపి దివ్యాంగులకు రూ.12 వేలకోట్లు సర్కారు బకాయి పడిందని ఆరోపించారు. సీఎస్బీ ఐఏఎస్ అకాడమీ వ్యవస్థాపకురాలు బాలలత మాట్లాడుతూ.. దివ్యాంగులు చట్టసభల్లోకి రావాలని, వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.