బంట్వారం : బంట్వారం మండలంలో బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీఓ నాగరాజు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన అధ్యక్షతన మండల పరిషత్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య ఉచితంగా అందిస్తున్నామని నమోదు పెంచుకోవాలని ఆ దిశలో జరిగే బడిబాట కార్యమాన్ని విజయవంతం చేసేందుకు కృషి చేయాలని మండల విద్యాధికారి వెంకటేశ్వరరావు కోరారు.
ఈ కార్యక్రమంలో మండల తాసిల్దార్ విజయకుమార్, మండల విద్యాధికారి పి వెంకటేశ్వర రావు, ఏపీఎం దేవయ్య,అంగన్వాడీ సూపర్వైజర్, ధనలక్ష్మి ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సుధాకర్, విక్రమ్ రెడ్డి ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు,గ్రామ కార్యదర్శులు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.